23 August, 2026 | 5:20 PM

జపాన్ మాస్టర్స్ ఆధ్వర్యంలో మాస్టర్స్‌కు శిక్షణ

23-08-2026 04:32 PM

నిర్మల్, ఆగస్టు 23 ( విజయక్రాంతి): జపాన్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 18వ మాన్‌సూన్ ట్రైనింగ్ క్యాంప్  నిర్మల్ కరాటే శిక్షకులు ప్రతిభ సాధించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు హైదరాబాద్‌లోని కోట్ల విజయ భాస్కర్ ఇండోర్ స్టేడియంలో ఘనంగా జరిగింది. జపాన్‌కు చెందిన ప్రముఖ మాస్టర్స్ తనియామా, వై. హకిజుమే, జపాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా నేషనల్ చీఫ్ మాస్టర్ ఆనంద్ రత్న, తెలంగాణ చీఫ్ ఇన్‌స్ట్రక్టర్ సెన్సై రాపోలు సుదర్శన్ ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణలో ప్రతిభ సాధించారు. తెలంగాణ కరాటే అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సెన్సేయ్ తెజేందర్ సింగ్ భాటియ  మాస్టర్స్ కొండాజీ శ్రీకాంత్,, భూషణ్,, మృణాలిని,, మనీషా,, శ్రీకాంత్,, శరణ్య,, నితిన్,, జ్ఞానతేజ,, సోనితాయి,, రిషికేష్,, ప్రదీప్,, ఆరిఫ్ఖాన్,, నారాయణ విద్యార్థులను అభినందించారు.