ఫైనాన్షియల్ లీట్రసీపై సీఆర్పీలకు శిక్షణ
నాగర్ కర్నూల్ జూన్ 30 ( విజయక్రాంతి ): సీఆర్పీలకు ఆర్థిక అవగాహన పెంపొందించే లక్ష్యంతో యూనియన్ బ్యాంకు సహకారంతో (ఆర్‌ఏస్టీఐ)లో వారంరోజుల ఫైనాన్షియల్ లిటరసీ శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని మంగళవారం అదనపు డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ రాజేశ్వరి ప్రారంభించారు. కార్యక్రమంలో ఆర్‌ఏస్టీఐ డైరెక్టర్ షేక్ అహ్మద్ జావేద్, ఎల్డీఎం చంద్రశేఖర్, డీపీఎంలు బాషా నాయక్, కృష్ణయ్య, ఏపీఎం ప్రభాకరాచారి పాల్గొన్నారు.
ఈ శిక్షణలో ఆర్థిక క్రమశిక్షణ, బ్యాంకింగ్ సేవలు, పొదుపు అలవాట్లు, సైబర్ భద్రతపై అవగాహన, స్వయం సహాయక సంఘాల గ్రూపు వ్యవసాయం, రుణాల మంజూరు ప్రక్రియ, రుణాల విడుదల విధానం వంటి అంశాలపై నిపుణులు శిక్షణ అందించనున్నారు. సీఆర్పీలు గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సంఘాలకు ఆర్థిక అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తున్నందున ఈ శిక్షణ వారికి ఎంతో ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు.






