10 April, 2026 | 8:36 PM

Breaking News

ప్రజల ఆరోగ్య పరిరక్షణకే ప్రత్యేక వైద్య శిబిరం   •   అందరి సహకారంతోనే గ్రామాభివృద్ధి   •   నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ డిసిసి ఉపాధ్యక్షుడిని సన్మానం   •   గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్   •   చిన్నారికి ఆర్థిక సాయం అందజేసిన పిఎసిఎస్ మాజీ చైర్మన్ జాలే నరసింహారెడ్డి   •   శివంగాలపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహణ   •   బనిగండ్లపాడులో మెగా హెల్త్ క్యాంపును ప్రారంభించిన బండారు   •   నిమ్మపల్లిలో యువతి అదృశ్యం – పోలీసుల దర్యాప్తు ప్రారంభం   •   నూతన తహసిల్దార్ ని మర్యాద పూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు   •   విద్యుత్ శాఖ కాంపౌండ్ లో అగ్నిప్రమాదం   •  

ఫుట్‌పాత్ వ్యాపారులపై ట్రాఫిక్ పోలీసుల కొరడా

10-04-2026 12:52 AM

ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి అశోక్ నగర్ వరకు ఫుట్‌పాత్‌ల ఆక్రమణ తొలగింపు

ముషీరాబాద్,ఏప్రిల్ 9(విజయక్రాంతి): ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుండి అశోక్ నగర్ క్రాస్ రోడ్ వరకు  అక్రమ నిర్మాణాల తొలగింపు కార్యక్రమంలో భాగంగా ఫుట్ పాత్  ఆక్రమణలపై ట్రాఫిక్ పోలీసులు కొరడా  ఝలిపిం చారు. ఇందులో భాగంగా గురువారం ట్రాఫిక్-1 డీసీపీ అవినాష్ కుమార్ ఆర్టీసీ క్రాస్ రోడ్డు ప్రాంతంలో జీహెచ్‌ఎంసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా ప్రత్యేక రోప్ డ్రైవ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రోడ్డుకు ఇరువైపులా ఫుట్ పాత్‌లపై  ఆక్రమించి ఏర్పాటు చేసిన షాపుల డబ్బాలు, తాత్కాలిక నిర్మాణాలను సిబ్బంది భారీ యంత్రాలతో తొలగిం చారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ పాదచారుల హక్కులను కాలరాస్తూ ఫుత్ పాత్ లను వ్యాపారాలకు వాడుకుంటే సహించేది లేదన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులను నివారించేందుకు ఇటువంటి డ్రైవ్లు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశా రు. 

అదనపు డీసీపీ (ట్రాఫిక్) రాము లు, సికింద్రాబాద్ జోన్ ట్రాఫిక్ ఏసిపి శ్రీనివాస్, చిక్కడపల్లి, గాంధీనగర్, ఉస్మాని యా యూనివర్సిటీ, చిలకలగూడ, కాచిగూడ, మహంకాళి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లు ఏడుకొండలు, డి.వెంకట్ రెడ్డి, కె.సత్యనారాయణ, జగన్ రెడ్డి, కౌశిక్ , శోభన్ కుమార్ తో జిహెచ్‌ఎంసి టౌన్ ప్లానింగ్ ఏసిపి శ్రీనివాస్, జిహెచ్‌ఎంసి డిఈ గీత తదితర అధికారులు పాల్గొన్నారు.