10 August, 2026 | 4:42 PM

జాతీయ జెండా ఆవిష్కరించిన కందుల శ్రీనివాస్

10-08-2026 03:42 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ జాతీయ, రాష్ట్ర శాఖల పిలుపు మేరకు సోమవారం పెద్దపల్లి జిల్లా  సుల్తానాబాద్ మండల కేంద్రంలో బీజేపీ సుల్తానాబాద్ మండల అధ్యక్షులు కందుల శ్రీనివాస్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి భారతీయుడిలో దేశభక్తి, జాతీయతా భావాన్ని మరింత బలోపేతం చేయడమే హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు సౌదరి మహేందర్ యాదవ్, మిట్టపల్లి ప్రవీణ్ కుమార్,హర్ ఘర్ తిరంగా జిల్లా కో కన్వీనర్ ఉషణ అన్వేష్, కోట నాగేశ్వర్, కొల్లూరి సంతోష్ కుమార్,లంక శంకర్, కొమ్మిడి రాజేందర్ రెడ్డి, మెండే శంకరయ్య, బండారి లత,మల్కా భాగ్యలక్ష్మి,దాసరి వెంకటేష్,పెరక రమేష్, దొంగల శ్రీనివాస్ రెడ్డి, మనోహర్,వలస సాయి కిరణ్, కొత్తూరి సంపత్,గుర్రం  రమేష్,మెంగాని కుమార్, మనుపటి బాలకృష్ణ, ప్రశాంత్, ఈశ్వర్, సుబ్బని సురేష్ తదితరులు పాల్గొన్నారు.