ఘనంగా త్రివర్ణ పతాక ప్రదర్శన
ఆసిఫాబాద్(విజయ క్రాంతి): జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో సోమవారం త్రివర్ణ పతాక ప్రదర్శన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.మీడియా ప్రతినిధులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించారు.ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు మురుమురం రాజు, ప్రధాన కార్యదర్శి సదాశివ్, ప్రింట్ మీడియా అధ్యక్షుడు వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ ను బీజేపీ నాయకులు శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం, గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోట్నాక్ విజయ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు షేర్ల మురళీధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి అరిగెల మల్లికార్జున్, త్రివర్ణ యాత్ర జిల్లా కన్వీనర్ కాంద్రే విశాల్, కో-కన్వీనర్ సప్త శ్రీనివాస్, నవీన్ గౌడ్, బాలకృష్ణతో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






