నిర్మల్ పట్టణంలో కార్మిక సంఘాల ర్యాలీ
10-08-2026 07:45 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జైల్ బరో కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం నుండి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించి కార్మికుల చట్టాలను కాపాడాలని ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు విడనాడాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు నూతన కుమార్ సురేష్ కుమార్ రాజన్న చంద్రకళ లక్ష్మణ్ గంగన్న గఫూర్ ఉన్నారు






