10 August, 2026 | 9:13 PM

తీజ్ వేడుకల్లో సందడి చేసిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

10-08-2026 07:48 PM

ఉప్పల్,(విజయక్రాంతి): చర్లపల్లి డివిజన్ పరిధిలోని మారుతి కాలనీ, చక్రిపురం ప్రాంతంలో ఘనంగా నిర్వహించిన తీజ్ వేడుకల్లో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పాల్గొని మహిళలు, యువతతో కలిసి ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... తీజ్ పండుగ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు.

మహిళల ఐక్యత, ఆనందోత్సాహాలకు ప్రతిబింబంగా జరిగే ఇలాంటి పండుగలను ప్రతి ఒక్కరూ సోదరభావంతో నిర్వహించుకోవాలని సూచించారు. మహిళలకు తీజ్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన ఆయన, ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.వేడుకల్లో మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎమ్మెల్యే మహిళలు, యువతతో కలిసి పండుగ సంబరాల్లో పాల్గొనడంతో కార్యక్రమం మరింత ఉత్సాహభరితంగా సాగింది.