10 August, 2026 | 10:23 PM

5 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

10-08-2026 09:06 PM

ఒకరిపై కేసు నమోదు

బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని ఎలుక పల్లి గ్రామానికి చెందిన ప్రేమ్ కుమార్ ఆటోలో ఐదు క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నట్లు ఎస్సై సర్తాజ్ పాషా తెలిపారు. ఎలుక పెళ్లి గ్రామం నుండి ఆటోలో రేషన్ బియ్యం మహారాష్ట్రకు తరలిస్తున్న క్రమంలో కృష్ణ పల్లి గ్రామ సమీపంలో పక్క సమాచారం మేరకు పట్టుకున్నట్లు ఎస్సై తెలిపారు. అట్టి రేషన్ బియ్యం ను స్వాధీన పరుచుకొని, ఆటోను సీజ్ చేసినట్టు తెలిపారు. అక్రమంగా రేషన్ బియ్యం కొనుగోలు చేసిన విక్రయించిన రవాణా చేసిన అట్టి వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.