మృతి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త తల్లికి పద్మాదేవేందర్‌రెడ్డి నివాళి
10-08-2026 08:34 PM
రామాయంపేట,(విజయ క్రాంతి): రామాయంపేట మండలం కాట్రియాల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కొత్త సుధాకర్‌రెడ్డి తల్లి కొత్త శ్యామల ఆదివారం మృతిచెందారు. విషయం తెలుసుకున్న మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి సోమవారం కాట్రియాల గ్రామంలోని సుధాకర్‌రెడ్డి నివాసానికి వెళ్లి శ్యామల చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా శ్యామల మృతికి సంతాపం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కాట్రియాల ఉపసర్పంచ్ బాబు నాయక్, మాజీ సర్పంచ్ శ్యామ్, శ్యామ్ రెడ్డి, సాయి రెడ్డి, మైస గౌడ్, బోయిని శ్యామ్, సత్యపాల్, శ్రీకాంత్ సాగర్, బసవయ్య, వార్డు మెంబర్ మల్లారెడ్డి, గడిల ప్రమోద్ , బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.






