సంజయ్‌ని కలిసిన బిజెపి జిల్లా అధ్యక్షులు
10-08-2026 08:45 PM
ముకరంపుర,(విజయక్రాంతి): బిజెపి జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన సాయిని మల్లేశం మొదటిసారిగా కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ని మర్యాద పూర్వకంగా కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన సాయిని మల్లేశంను కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ అభినందించారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని ఈ సందర్భంగా బండి సంజయ్ సూచించారు .






