28 March, 2026 | 2:42 AM

సీతారామచంద్ర కల్యాణోత్సవంలో పాల్గొన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దంపతులు

28-03-2026 12:37 AM

కామారెడ్డి, మార్చి 27 (విజయక్రాంతి): కామారెడ్డి నియోజకవర్గంలో శుక్రవారం నిర్వహించిన శ్రీ రామ వేడుకల్లో టి పి సి సి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, గడ్డం ఇందుప్రియ దంపతులు వేడుకల్లో పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రం లోని 14వ వార్డు కాకతీయ నగర్ తో పాటు ఆడ్లూరు, తలమడ్ల, భిక్కనూర్ గ్రామాలలో జరిగిన సీతారామచంద్రల కల్యాణోత్సవాల్లో పాల్గొని ఆయా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సన్మానం చేశారు.

ఈ సందర్భంగా టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీరాముని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. కామారెడ్డి నియోజకవర్గ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు సబ్బని కృష్ణ హరి, పట్టణ కౌన్సిలర్లు గడ్డమీద మహేష్, రామ్ శెట్టి హర్షిత, మాజీ కౌన్సిలర్లు పంపరి శ్రీనివాస్, చాట్ల వంశీ, శ్రీధర్, రాజశేఖర్ బండారి శ్రీకాంత్ , నర్సోల్ల మహేష్, బల్ల శ్రీనివాస్, హైమద్, అరుణ్ గౌడ్, ఆకాష్, మున్ను, తదితరులు పాల్గొన్నారు.

తాడ్వాయిలో..

తాడ్వాయి, మార్చి, 27 (విజయక్రాంతి) : కామారెడ్డి జిల్లా తాడువాయి మండలంలో శుక్రవారం శ్రీరామనవమి సందర్భంగా  శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తాడువాయి మండల కేంద్రంలోని శ్రీ శబరిమాత ఆశ్రమంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ సీతారాముల కళ్యానాన్ని ఘనంగా నిర్వహించారు.  అదిలాబాద్, నిర్మల్, బైంసా, కరీంనగర్, నారాయణఖేడ్, బీదర్, మెదక్, నిజామాబాద్, హైదరాబాద్ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి శ్రీ సీతారాముల కళ్యాణం లో పాల్గొన్నారు. 

ఎర్ర పహాడ్  గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో  శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. నందివాడ, కన్కల్, దేమికలాన్, కృష్ణాజివాడి గ్రామాల్లో కళ్యాణాన్ని  నిర్వహించారు. నందివాడ గ్రామంలో ప్రత్యేకంగా శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవానికి విచ్చేసిన భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.  

బీబీపేట్‌లో..

బీబీపెట్, మర్చి 27 (విజయక్రాంతి): బీబీపేట్ మండల కేంద్రంలోని హనుమాన్ మందిరంలో  శుక్రవారం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నులపండువగా జరిగింది.  ఈ సందర్భంగా సర్పంచ్ సాధ్విక సాయినాథ్ పట్టు వస్త్రాలు సమర్పించారు. భక్తులు భారీగా హాజరై స్వామివారి దర్శనం చేసుకుని ఆశీర్వాదాలు పొందారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించగా భక్తులు పాల్గొన్నారు.  ఉప సర్పంచ్ ప్రశాంత్ పాల్గొన్నారు.

బీబీపేట్ మండలం యడారం గ్రామంలోని రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద మంత్రోచ్చారణల మధ్య అర్చకులు సంప్రదాయబద్ధంగా కళ్యాణాన్ని జరిపించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గోబ్బూరి సుధారాణి బాపురెడ్డి, టి. రఘునందన్ రావు, పి. తిరుమలరావు, డిఆర్డిఓ సిహెచ్ శ్రీనివాసరావు, సెర్ప్ స్టేట్ డైరెక్టర్ సిహెచ్ గోపాల్ రావు, ఆలయ కమిటీ చైర్మన్ గొబ్బూరి రాజిరెడ్డి, మాజీ ఎంపీటీసీ రాజేశ్వరరావు, వెంకట్రావు, మాజీ సర్పంచ్ రవి తదితరులు పాల్గొన్నారు.

బీబీపేట్ మండలం మల్కాపూర్ గ్రామంలోని హనుమాన్ మందిరంలో శ్రీరామ నవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ నాగరాజు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు.  అనంతరం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించగా గ్రామస్తులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

అంచనూర్‌లో..  

కామారెడ్డి అర్బన్, మార్చి 2౭ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అంచనూర్ గ్రామంలో శ్రీరామ నవమి సందర్భంగా సర్పంచ్ జనగామ నరేష్ ఆధ్వర్యంలో సీతారాముల విగ్రహాల ఊరేగింపును ఘనంగా నిర్వహించారు.  అనంతరం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నులపండువగా జరిగింది. వేద మంత్రోచ్చారణల మధ్య అర్చకులు సంప్రదాయబద్ధంగా కళ్యాణాన్ని నిర్వహించారు.  తరువాత మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, భక్తులు విస్తృతంగా పాల్గొన్నారు.

కంచర్లలో ..

భిక్కనూర్, మార్చి 27 (విజయక్రాంతి):  భిక్కనూర్ మండలం కంచర్ల గ్రామంలో శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని హనుమాన్ మందిరంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాలదారులు భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించి భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రార్థనలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ మాలదారులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.