3 July, 2026 | 11:39 AM

హరీష్ రావు అరెస్టును ఖండించిన పట్టణ అధ్యక్షులు ఎర్ర యాదగిరి

03-07-2026 10:35 AM

హరీష్ రావు, అక్రమ  అరెస్ట్ ను తీవ్రంగా ఖండించిన పట్టణ అధ్యక్షులు ఎర్ర యాదగిరి

చేగుంట జూలై 03: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను, గురుకుల పాఠశాలల టెండర్లలో అవినీతిని ఎండగట్టేందుకు సిద్ధమైన మాజీ మంత్రి హరీశ్‌రావును, ఇతర బీఆర్‌ఎస్ ముఖ్యనేతలను పోలీసులు అడ్డుకుని అక్రమంగా అరెస్టు చేయడాన్ని  చేగుంట పట్టణ అధ్యక్షులు ఎర్ర యాదగిరి  తీవ్రంగా ఖండించారు. ఈ సందర్బంగా గురువారం ఒక ప్రతీక ప్రకటన విడుదల చేస్తూ,మంత్రులు విసిరిన బహిరంగ చర్చ సవాలును స్వీకరించి, ఆధారాలతో సహా గన్‌పార్క్‌కు బయలుదేరిన బిఅర్ఎస్ నేతలను మార్గమధ్యలోనే అరెస్ట్ చేయడం  ప్రభుత్వం యొక్క పిరికితనానికి, అప్రజాస్వామిక ధోరణికి నిదర్శనమని ఆయన విమర్శించారు.

ప్రభుత్వం ఎదుర్కొంటున్న విమర్శలకు సమాధానం చెప్పలేక, పోలీసు బలగాలను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాల గొంతు నొక్కాలని ప్రయత్నించడం దుర్మార్గమని అన్నారు,         ప్రజా సమస్యలపై చర్చించేందుకు ముందుకు వచ్చిన ప్రజాప్రతినిధులను ముందస్తు అరెస్టులు చేయడం ద్వారా ప్రభుత్వం తన అసమర్థతను చాటుకుంటోందని ఆయన పేర్కొన్నారు. కేవలం పోలీసుల అండతో ప్రతిపక్షాలను భయపెట్టి, ప్రభుత్వ అవినీతిని కప్పిపుచ్చుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు ఫలించవని ఆయన హెచ్చరించారు. అక్రమంగా అరెస్టు చేసిన హరీశ్‌రావుతో పాటు పార్టీ నేతలను తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ప్రజా క్షేత్రంలో ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, ఇలాంటి అణచివేత చర్యలు మానుకోకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.