22 April, 2026 | 9:02 PM

గొర్రెల కాపరికి న్యాయం చేసిన పట్టణ సీఐ శివశంకర్

22-04-2026 07:14 PM

కోదాడ,(విజయక్రాంతి): మోస పోయిన గొర్రెల కాపరి కి న్యాయం చేసి అతని కి భరోసా ఇచ్చి ఫ్రెండ్లీ పోలీస్ అనే మాటను కోదాడ సిఐ శివ శంకర్ నిలబెట్టుకున్నారు. బుధవారం పట్టణసీఐ శివశంకర్ తెలిపిన వివరాల ప్రకారం మహబూబ్ నగర్ నుండి గొర్రెల మందను మేపుకోవడానికి కోదాడ ప్రాంతానికి వచ్చిన గొర్రెల కాపరి తన కుటుంబ సభ్యులకు అనారోగ్యం కావడంతో అత్యవసరంగా కొన్ని గొర్రెలను విక్రయించాడు. కాగా అతడు పూర్తి గా నగదు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతుండడంతో సిఐనీ ఆశ్రయించాడు. నగదు ఇప్పించి అక్కున  చేర్చుకున్నారు.