28 February, 2026 | 9:15 AM

టమాటా రకం మిర్చి@50 వేలు

28-02-2026 12:50 AM

క్వింటాలుకు పలికిన ధర

మహబూబాబాద్, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి): టమాటా రకం మిర్చి ధర క్విం టాలుకు వరంగల్ వ్యవసాయ మార్కెట్‌లో శుక్రవారం రూ.50 వేలు పలికి సరికొత్త రికా ర్డు సృష్టించింది. గురువారం ఈ రకం మిర్చికి క్వింటాలకు రూ.40 వేల ధర లభించగా, 24 గంటల వ్యవధిలోనే పదివేల రూ పాయలు అధికంగా పలకడం విశేషంగా మా రింది. తేజ రకం మిర్చికి కూడా క్వింటాలుకు రూ.19 వేల ధర లభించడం గమనా ర్హం. మిర్చి పంట ఆశించిన అంతగా దిగుబడి రాకపోవడం, డిమాండు పెరగడంతో ధర పెరగడానికి కారణంగా వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి.