నేడు ఉగాది జానపద జాతర
18-03-2026 02:37 PM
నిర్మల్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని వెన్నెల డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాల పంపిణీ జానపద జాతర నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు ధనరాజ్ తెలిపారు. మున్సిపల్ కార్యాలయం ముందు ప్రముఖ కళాకారులు యూట్యూబ్ ఇరువకుల ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవం కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామన్నారు. ఉగాది పండుగ ప్రాధాన్యతను ప్రజలకు తెలిపేందుకే వెన్నెల డాన్స్ అకాడమీ ఈ కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాయిరాం భోజన్న సాయి కృష్ణ సురేష్ లక్ష్మి పాల్గొన్నారు




