పారిశుద్ధ్య పనులను పరిశీలించిన ఎంపీఓ
17-07-2026 07:27 PM
పినపాక, (విజయక్రాంతి): పినపాక మండలం భూపాలపట్నం గ్రామపంచాయతీలో సర్పంచ్ తొలేం స్వప్న ఆధ్వర్యంలో పరిశుద్ధ పనులు నిర్వహించారు. గ్రామపంచాయతీలో రోడ్డుకు ఇరువైపులా సైడు డ్రైనేజీ పనులను చేయించారు. గ్రామపంచాయతీలో జరిగే అభివృద్ధి పనులను పినపాక ఎంపీఓ శ్రీనివాస్ పరిశీలించారు. గ్రామపంచాయతీ పరిధిలో ప్రతి సమస్యకు పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.






