17 July, 2026 | 6:41 PM

పరిశుభ్రతే సీజనల్ వ్యాధులకు నివారణ

17-07-2026 06:33 PM

మెట్ పల్లి,(విజయక్రాంతి): వర్షకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల నివారణకు పరిశుభ్రతే ముఖ్యమని వేంపేట్ సర్పంచ్ గోరుమంతుల ప్రవీణ్ కుమార్ అన్నారు. శుక్రవారం గ్రామంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా, దోమల నివారణ చర్యల్లో భాగంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని డ్రైనేజీల పరిసరాలు, నిల్వ నీటి ప్రాంతాలు, బావుల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లి పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు.

ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ... గ్రామ ప్రజలు పరిశుభ్రత పాటించి, నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గోరుమంతుల ప్రవీణ్ కుమార్, ఉపసర్పంచ్ అల్లూరి సురేందర్ రెడ్డి, కార్యదర్శి రాజు,వైద్యుడు డా. నాగార్జున, ఏఎన్‌ఎం కవితారాణి, వార్డు సభ్యులు చంద్రాచారి, దశకంఠ రాజు, జెల్ల శ్రీనివాస్ యాదవ్, నల్ల శేఖర్ రెడ్డి, నలిమేల అంజిరెడ్డి, గోరుమంతుల రఘు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, మహిళా సంఘాల వీఓ లీడర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.