calender_icon.png 7 February, 2026 | 2:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకునేందుకే..

07-02-2026 12:00:00 AM

భూమిక ప్రధాన పాత్రలో సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్నేశ్ గవిరెడ్డి కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘యుఫోరియా’. రాగిణి గుణ సమర్పణలో నీలిమ గుణ, యుక్తా గుణ నిర్మాతలుగా డైరెక్టర్ గుణ శేఖర్ తెరకెక్కించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సక్సెస్ సెలబ్రేషన్స్ కార్యక్రమంలో గుణశేఖర్ మాట్లాడుతూ.. “యుఫోరియా’తో రెగ్యులర్ కమర్షియల్ పంథాలో కాకుండా, ఎలాంటి ఫార్ములా ఫాలో కాకుండా హార్డ్ హిట్టింగ్ చెప్పాలని అనుకునే ప్రయత్నించాం. నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకోవాలని ‘యుఫోరియా’తో ప్రయత్నించాను” అన్నారు. నిర్మాత నీలిమ గుణ మాట్లాడుతూ.. “యుఫోరియా’ సినిమాకు అమ్మాయిలు, అమ్మలు.. కనెక్ట్ అవుతున్నారు. అన్నివర్గాల ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే సినిమా ఇది” అని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో పృథ్వీ అడ్డాల, విఘ్నేశ్ గవిరెడ్డి కూడా మాట్లాడారు.