9 May, 2026 | 1:22 AM

టైటాన్స్ వర్సెస్ రాయల్స్

09-05-2026 12:00 AM
  1. గుజరాత్‌తో రాజస్థాన్ కీలకపోరు
  2. వైభవ్ పైనే అందరి చూపు

జైపూర్, మే 8 : ఐపీఎల్ 19వ సీజన్‌లో టాప్ 4 రేస్ మరింత రసవత్తరంగా మారిపోతోంది. ఆరంభంలో వరుస విజయాలు సా ధించిన జట్లను ఇప్పుడు పాయింట్ల పట్టికలో కింద ఉన్న టీమ్స్ టెన్షన్ పెడుతున్నాయి. ఈ క్రమంలో రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ కీలక పోరుకు సిద్ధమయ్యా యి. వరుస విజయాలతో దూసుకెళుతున్న గుజరాత్, రాజస్థాన్‌తో తలపడబోతోంది. గత మూడు మ్యాచ్‌లలోనూ గుజరాత్ టైటాన్స్ అదిరిపోయే ప్రదర్శనతో ఆకట్టుకుంది. బౌ లింగ్‌లోనూ, బ్యాటింగ్ లోనూ అద్భుతంగా రాణించింది. ఒకదశలో రేసులో వెనుకబడిందనుకున్న టైటాన్స్ ఆల్ రౌండ్ పెర్ఫా ర్మెన్స్‌తో ఇప్పుడు దూసుకొచ్చింది. చెన్నై, బెంగళూరు, పంజాబ్ జట్లపై ఛేజింగ్ చేసి విజయాలను అందుకుంది.

బ్యాటింగ్‌లో సాయి సుదర్శన్, గిల్ మెరుపు ఆరంభాలనిస్తుండగా... బట్లర్ తన ఫామ్ కొనసాగి స్తున్నాడు. తెవాటియా మాత్రం ఇంకా ఫామ్‌లోకి రాలేదు. అటు జాసన్ హోల్డర్ మాత్రం ఆల్‌రౌండర్‌గా రాణిస్తున్నాడు. ము ఖ్యంగా బౌలింగ్‌లో గుజరాత్‌కు మ్యాచ్ విన్నర్‌గా మారిపోయాడు. పెద్ద జట్లపై అద్భుతమైన బౌలింగ్‌తో అదరగొడుతున్నా డు. అటు రబాడ, సిరాజ్‌తో పాటు అర్షద్ ఖాన్ పేస్ విభాగంలో కీలకంగా ఉన్నారు. ఇటు స్పిన్ విభాగంలో రషీద్ ఖాన్, వాషింగ్టన్ సుందర్ రాణిస్తున్నారు.మరోవైపు గత మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ పై ఓడిపోయిన రాజస్థాన్ రాయల్స్ మళ్లీ గెలుపు బాట పట్టాలని భావిస్తోంది. ప్రస్తుతం రాజస్థాన్ 10 మ్యాచ్‌లలో ఆరు విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది.

మరో మూడు మ్యాచ్‌లు గెలిస్తే ప్లే ఆఫ్ బెర్త్ ఖరారవుతుంది.  రాజస్థాన్ రాయల్స్ బలమం తా బ్యాటింగే. ఓపెనర్లు జైస్వాల్, వైభవ్ సూ ర్యవంశీ విధ్వంసకర ఆరంభాలను అందిస్తున్నారు. కెప్టెన్ రియాన్ పరాగ్ కూడా ఫామ్ లోకి వచ్చాడు. చివర్లో శుభమ్ దూబే, ఫెరీ రా, జడేజా కూడా మెరుపులు మెరిపిస్తున్నారు. బౌలింగ్‌లో ఆర్చర్, బర్గర్ అదరగొ డుతుంటే, స్పిన్ విభాగంలో జడేజా, రవి బిష్ణోయ్ తమ మ్యాజిక్ చూపిస్తున్నారు. అయితే గుజరాత్ బౌలర్లను రాజస్థాన్ బ్యా టర్లు ఏ విధంగా ఎదుర్కొంటారనేది చూడా లి. గత రికార్డులను చూస్తే ఇరు జట్లు 9 సా ర్లు తలపడితే గుజరాత్ ఆరింటిలో గెలిచింది. 

తుది జట్లు అంచనా

రాజస్థాన్ రాయల్స్ : జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, జురెల్, రియాన్ పరాగ్, హెట్‌మెయిర్, ఫెరీరా, జడేజా, ఆర్చర్, రవి బిష్ణో య్, బ్రిజేష్ శర్మ, బర్గర్, తుషార్ దేశ్‌పాండే

గుజరాత్ టైటాన్స్ : శుభ్‌మన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, బట్లర్, వాషింగ్టన్ సుందర్, హోల్డర్, షారూఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మానవ్ సుతార్, రబాడ, సిరాజ్