9 May, 2026 | 2:34 AM

ఐపీఎల్‌లో హనీట్రాప్ కలకలం?

09-05-2026 12:00 AM
  1. ప్లేయర్స్, ఫ్రాంచైజీలకు బీసీసీఐ వార్నింగ్
  2. నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు

ముంబై, మే 8 : రసవత్తరంగా సాగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్‌లో హనీట్రాప్ కలకలం రేపింది. పూర్తిస్థా యిలో కాకున్నా కొన్ని అనుమానాస్పద ఘ టనలతో బీసీసీఐ అప్రమత్తమైంది. సన్ రైజ ర్స్ హైదరాబాద్ ప్లేయర్ అభిషేక్ శర్మ హో టల్‌లోకి వెళుతుండగా ఒక యువతి హఠాత్తుగా చేయిపట్టుకుని లాగడం ఈ అనుమా నాలకు కారణమైంది. అక్కడున్న వారంతా ఆ యువతి చేసిన పనికి షాక్ అయ్యారు. అనంతరం సెక్యూరిటీ సిబ్బంది అభిషేక్ చేయిని విడిపించి ఆ యువతిని అక్కడి నుం చి పంపించేశారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో బీసీసీఐ దృష్టి సారించింది. ఇలాంటివి హనీ ట్రాప్‌లు కావొచ్చని, ఆటగాళ్లు, ఫ్రాంచైజీలు, సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదే శించింది. ఈ సందర్భంగా  లీగ్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ కొన్ని కీలక సూచనలు కూడా జారీ చేసారు. ఇటీవల రాజస్థాన్ రా యల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ ఈ- వ్యవహారం కూడా బీసీసీఐకి ఇబ్బందిగా మారింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఫ్రాం చైజీలకు, ఆటగాళ్లకు బోర్డు స్పష్టమైన ఆదేశాలిచ్చింది.

అనధికార వ్యక్తలను కలవొద్దని, ఆటగాళ్లు బస చేసే హోటల్ రూమ్స్ దగ్గరకు కుటుంబసభ్యులను తప్ప అపరిచిత వ్యక్తలను అనుమతించవద్దని ఆదేశించింది. అ లాగే ప్లేయర్స్ ఎవరినైనా కలవాలంటే బహిరంగా ప్రదేశాల్లోనే మీట్ అవ్వాలని ఆదేశిం చింది. దీనికి మేనేజర్ అనుమతి తప్పనిసరిగా పేర్కొంది. అలాగే ఆటగాళ్లు బహిరంగ ప్రదేశాలకు అనుమతి లేకుండా, పూర్తి సె క్యూరిటీ లేకుండా వెళ్లొద్దని స్పష్టం చేసింది. ఆటగాళ్ళను కలిసే వారి వివరాలు తీసుకోవాలని సూచించింది.

అవసరం అయితే తా ము ఆకస్మిక తనిఖీలు కూడా చేస్తామని హె చ్చరించింది. ఆటగాళ్ల భద్రత, ప్రస్తుతం జారీ చేసిన నిబంధనలు అమలు చేసే విషయం లో ఫ్రాంచైజీలదే బాధ్యతగా పేర్కొంది. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు తమ దృష్టి కి వచ్చాయనీ, ఇలాంటివి ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదనీ ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్, బీసీసీఐ సెక్రటరీ దేవజీత్ సైకియా చెప్పారు. ఫ్రాంచైజీ యాజమాన్యం, అధికారులు డగౌట్‌లో ఆటగాళ్లతో మాట్లాడకూడదని మరోసారి స్పష్టం చేసింది.