రైతులు పూర్తిస్థాయిలో సహకరించాలి
17-07-2026 06:11 PM
బెజ్జూర్,(విజయక్రాంతి): మండలంలోని కృష్ణపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో సమగ్ర భూ రీ-సర్వేపై అవగాహన సదస్సు నిర్వహించినట్లు తహసీల్దార్ రామ్మోహన్‌రావు తెలిపారు.ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలంలోని రేచిని, బట్టుపల్లి, గబ్బాయి, సుస్మీర్, నాగేపల్లి రెవెన్యూ గ్రామాల్లో భూముల రీ-సర్వే చేపట్టనున్నట్లు తెలిపారు.
రైతులు, పట్టాదారులకు రీ-సర్వే ప్రక్రియ, ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. భూ రీ-సర్వే విజయవంతంగా నిర్వహించేందుకు రైతులు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కృష్ణపల్లి సర్పంచ్ వడ్డేపల్లి లావణ్య శ్రీనివాస్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రవీందర్, గ్రామ కార్యదర్శి రోజా, ఎంసీ శ్రీకాంత్, అటవీ శాఖ బీట్ అధికారి వెంకటేష్, కారోబార్ సుధాకర్, రైతులు తదితరులు పాల్గొన్నారు.






