మహమ్మద్ ఖాసీంబస్తీలో అక్రమ స్క్రాప్ దుకాణం తొలగింపు
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణం మహమ్మద్ ఖాసీంబస్తీలో అక్రమంగా ఏర్పాటు చేసిన స్క్రాప్ దుకాణాన్నీ అధికారులు తొలగించారు. దుకాణం వల్ల స్థానిక ప్రజలకు తీవ్ర అసౌకార్యానికి గురవుతున్నారు. రవాణా రాకపోకలకు ఆటంకాల ఏర్పడుతున్నాయి. అలాగే వర్షాకాలాన్ని దృష్టిలోఉంచుకొని ప్రజారోగ్యానికి ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు మున్సిపాలిటీ అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు. స్క్రాప్ దుకాణం పై స్థానికులు మున్సిపాలిటీకి పలుమార్లు ఫిర్యాదులు చేశారు. లిఖిత పూర్వక దరఖాస్తులు చేశారు. అధికారులు స్క్రాప్ దుకాణ యజమానికి మున్సిపాలిటీ నోటీసులు జారీ చేశారు. స్క్రాప్ దుకాణాన్నీ తొలగించకో వడంతో మున్సిపాలిటీ అధికారులు అక్రమ స్క్రాప్ దుకాణాన్ని తొలగించారు.
- స్క్రాప్ దుకాణాలను తొలగిస్తాం..
ప్రజల కు అసౌకర్యం కలిగిస్తున్న మూడు స్క్రాప్ దుకాణాలను తొలగిస్తాంమని మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్ హెచ్చరించారు. పట్టణంలో ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్న మిగిలిన మూడు అక్రమ స్క్రాప్ దుకాణాలను కూడా త్వరలో తొలగిస్తామనిన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. దుకాణాన్నీ తొలగించిన వారిలో మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్, ఏ.ఈ. శ్రీ నిఖిల్, ఆర్వో భుజంగరావు ,వన్ టౌన్ ఎస్‌హెచ్‌ఓ శ్రీనివాస్, ఇన్‌చార్జ్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ జి.సునీల్, టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఇతర మున్సిపల్ అధికారులు ఉన్నారు.






