17 July, 2026 | 6:26 PM

ఐటీడీఏపై వస్తున్న అపోహలను ఆపాలి

17-07-2026 06:18 PM

ITDA భద్రాచలం కార్యాలయం మీద వరసగా  కాదనాల సమస్యను తక్షణమే పరిస్కరించాలి

గుండాల,(విజయక్రాంతి): ఆదివాసీ సంక్షేమ పరిషత్ గుండాల మండల కమిటీ అత్యవసర సమావేశంలో సంక్షేమ పరిషత్ మండల అధ్యక్షులు పూనెం రమణ బాబు మాట్లాడుతూ..గిరిజన అభివృద్ధి సంస్థ భద్రాచలం కార్యాలయంపై వస్తున్న అపోహలను నిర్ధారించాలని డిమాండ్ చేశారు. భద్రాచలం ప్రాజెక్టు అధికారి మీద, RCO మీద గురుకులం విభాగంలో అధికంగా ఆదివాసీ ఉద్యోగులు ఉన్నారనే అక్కసుతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లంబాడీ హక్కుల పోరాట సమితి (LHPS) నంగారబేరి నాయకులు జాతి వివక్షతతో చేస్తున్న ఆరోపణల కారణంగా ఆదివాసీ ఉద్యోగులు మరియు ITDA సిబ్బందిని మానసికంగా వేదిస్తూ సరైన ఆధారాలు లేకుండా వారి ఉద్యోగ జీవితాన్ని విచ్చిన్నం చేసే కుట్రగా భావించి ఏజెన్సీ విద్య, ఉపాధి, సంస్కృతికి రక్షణ గోడగా నిలబడిన ప్రాజెక్టు అధికారి PO పైన నిందలు వేయడం సరైంది కాదని అన్నారు.

తక్షణమే భద్రాద్రి జిల్లా LHPS నంగారాబేరి జిల్లా నాయకులను జిల్లా అధికారులు విచారణ చేసి, నిజ నిర్దారణ చేసి తక్షణం ఆ అధికార్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. లేని యెడల నిత్యం ITDA అధికార్లపైన ఇటువంటి అర్ధరహిత ఫిర్యాదులతో ఉద్యోగులు మనోవేదనకు గురి అవ్వాల్సి వస్తుంది అని, పరువు నష్టం దావాగా పరిగణించాలని, పది ఇరువై వేలకు గురుకులం సీట్లు అమ్ముకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఎక్కడో లంచాలు తీసుకుంటున్నారు ఇలా ఇష్ట రాజ్యాంగ నిందలు వేస్తూ PO వాటికి సపోర్ట్ చేస్తున్నారు.

అనడం చాలా విచాదకర ఆరోపణ చేసే నాయకులు నాయకులకు సమాచారం ఇచ్చే మేధావులు దగ్గర నుండి భద్రాద్రి జిల్లా అధికార్లు పూర్తి సమాచారం రాబట్టి దోషులను కఠినంగా శిక్షించాలి లేనియడల ఉద్యోగుల భవిష్యత్ ఒక్కటే కాదు విద్యార్థుల భవిష్యత్ మీద కుడా ప్రభావం చూపుతుంది ITDA భద్రాచలం మీద పూర్తి విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉందని తక్షణమే ఈప్రమాదాన్ని గమనించి చర్యలు తీసుకోవాలని పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ మండల ప్రధాన కార్యదర్శి గొగ్గెల సుధాకర్, జబ్బా సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.