14 August, 2026 | 3:13 PM

తాండూరులో ఉత్సాహంగా తిరంగా ర్యాలీ

14-08-2026 02:04 PM

భారత్ మాతాకీ జై... వందేమాతరం...నినాదాలతో మార్మోగిన పురవీధులు

భారీగా తరలివచ్చిన, నేతలు ప్రముఖులు, యువత.

తాండూరు, ఆగస్టు 14,(విజయ క్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూరులో శుక్రవారం తిరంగా ర్యాలీ ఉత్సాహంగా జరిగింది. తిరంగా యాత్ర అభియాన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జాతీయ జెండాలను చేతబట్టి భారీ సంఖ్యలో సంఖ్యలో ప్రజలు, యువత, విద్యార్థులు, వ్యాపారులు, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితి ప్రజా ప్రతినిధులు నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొని మువ్వన్నెల జెండాను గౌరవిస్తూ భారత్ మాతాకీ జై... వందేమాతరం.. తదితర దేశభక్తి నినాదాలు చేస్తూ దేశభక్తి ఉట్టిపడేలా పురవీధుల గుండా ముందుకు సాగారు. ఈ సందర్భంగా పలు వురు విద్యావేత్తలు, రాజకీయ నాయకులు, యువకులు మాట్లాడుతూ  స్వాతంత్ర సంగ్రామంలో తమ ప్రాణాలను  తృణప్రాయంగా సమర్పించిన దేశభక్తులను, వారి త్యాగాలను గుర్తు చేశారు. దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని కోరారు.