జేపీ నడ్డాకు అస్వస్థత.. ఎయిమ్స్ కీలక ప్రకటన
కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాకు అస్వస్థత
న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జే.పీ. నడ్డా(Union Health Minister JP Nadda hospitalised) అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన నడ్డాను ఢిల్లీలోని ఎయిమ్స్ (AIIMS)లో చేర్చినట్లు ఆసుపత్రి వర్గాలు శుక్రవారం తెలిపాయి. గురువారం ఆసుపత్రిలో చేరిన నడ్డాకు కరోనరీ యాంజియోగ్రఫీ నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, పర్యవేక్షణ కోసం ఆయనను కార్డియాలజీ విభాగంలో చేర్చారని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. "అస్వస్థత కారణంగా, ఆగస్టు 13, 2026 సాయంత్రం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జె.పి. నడ్డాకు కరోనరీ ఆంజియోగ్రఫీతో సహా పలు పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది, పర్యవేక్షణ నిమిత్తం ఆయనను ఎయిమ్స్ (AIIMS)లోని కార్డియాలజీ విభాగంలో చేర్చారు." అని ఆసుపత్రి యాజమాన్యం ప్రకటన విడుదల చేసింది







