31 March, 2026 | 3:35 AM

ఏసీబీకి పట్టుబడ్డ తిమ్మాజిపేట ఎస్సై

31-03-2026 12:03 AM

అక్రమ ఇసుక తరలింపునకు రూ.30 వేలు లంచం

నాగర్‌కర్నూల్, మార్చి 30 (విజయక్రాంతి): అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా సీజ్ వాహనాల రిలీజింగ్ ఆర్డర్ కోసం ఓ వ్యక్తి నుంచి రూ.30 వేల లంచం డిమాండ్ చేసిన విషయంలో తిమ్మాజిపేట ఎస్సై ఏసీబీకి పట్టుబడ్డాడు. ఇసుక తవ్వకాల కేసుకు సంబంధించి తిమ్మాజిపేట మండలం మరికల్ గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి చెందిన ట్రాక్టర్, జేసీబీని ఈ నెల 5న తిమ్మాజిపేట ఎస్సై హరిప్రసాద్‌రెడ్డి పట్టుకొని కేసు నమోదు చేశారు.

వివరాలను జిల్లా మైనింగ్ అధికారులకు పంపించగా మైనింగ్ అధికారులు వాహనాలకు రూ.60 వేల జరిమానా విధించారు. దీంతో బాధితుడు ఈ నెల 7వ తేదీన జరిమానా చెల్లించి వాహనాలను విడుదల చేయాలని కోరాడు. అయితే వాహనాలను విడుదల చేయాలంటే రూ.30 వేల లంచం ఇవ్వాలని ఎస్సై హరిప్రసాద్‌రెడ్డి డిమాండ్ చేశాడు.

ఇప్పటికే జరిమానా చెల్లించిన బాధితుడు మళ్లీ డబ్బు లు ఇవ్వాల్సి రావడంతో వాయిస్ రికార్డింగులు, రూ.20 వేల చెల్లింపునకు సంబంధిం చిన ఆధారాలతో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు సోమవారం పోలీస్ స్టేషన్‌కు చేరుకుని 20 వేల లంచం తీసుకుంటున్న అంశంపై ఎస్సైను అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు. 

మండలవాసుల సంబురాలు

ఎస్సై హర్షవర్ధన్‌రెడ్డి ఏసీబీకి పట్టుబడటంతో మండలవాసులు టపాసులు పేల్చి, స్వీట్లు పంచుకున్నారు. పంచాయతీ కార్మికుల నుంచి ప్రతి ఉద్యోగి, సామాన్యులను సైతం చిత్రహింసలకు గురిచేస్తూ డబ్బు లు దండుకుని సొమ్ము చేసుకున్నాదని వాపోయారు. అక్రమ ఇసుక మట్టి తరలింపు కల్తీ కల్లు, బెల్టు దుకాణాల వద్ద ముక్కుపిండి వసూలు చేశాడని ఆరోపించారు.