27 May, 2026 | 10:58 AM

పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించే వరకు ఉద్యమిస్తాం

27-05-2026 09:49 AM
  1. మోడీ సర్కార్ సామాన్య ప్రజలపై తీవ్రమైన భారం మోపుతున్నాడు...
  2.  ఏ పార్టీ ప్రశ్నించకపోయిన ప్రజల పక్షాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది...
  3. ధరలు పెంచడం అంటే దేశం కోసం, ధర్మం కోసం అవుతుందా...?
  4.  బిఆర్ఎస్ పార్టీకి బండి సంజయ్ కొడుకు పైన ఉన్న శ్రద్ధ , ప్రజలపై లేదన్నారు..
  5.  పెంచిన ధరలపై ఎక్కడబడితే అక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టాలి..
  6. డిసిసి చీఫ్, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేన రెడ్డి

వనపర్తి,(విజయక్రాంతి): బిజెపి పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంటూ దేశ ప్రజలకు మేలు చేయాల్సింది పోయి, రైతులకు, చిరు వ్యాపారులకు, కార్మికులకు, కర్షకులకు, సామాన్య ప్రజలందరూ జీవనోపాధి లేక ఇబ్బంది పడుతున్న అద్వాన పరిస్థితుల్లో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ , నిత్యవసర వస్తువులకు ధరలు పెంచి సామాన్య ప్రజలను తీవ్రమైన ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నారని వనపర్తి డిసిసి చీఫ్, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేన రెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డి లు మండిపడ్డారు. సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలో రామాలయం నుండి రాజీవ్ గాంధీ చౌరస్తా వరకు  కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శివసేన రెడ్డి  నేతృత్వంలో స్థానిక ఎమ్మెల్యే మేఘా రెడ్డి తో కలిసి పెంచిన పెట్రోలు, డీజిల్ ధరలపై ఎద్దుల బండ్ల పై ర్యాలీగా బయలుదేరి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ల పరిపాలనలో, సామాన్య ప్రజలు ఏనాడు ఇబ్బందులు పడకుండా ఆర్థిక సంక్షోభం వాటిల్లకుండా పరిపాలన అందించి, నిత్యవసర వస్తువుల పంపిణీ, డిజిల్, పెట్రోల్ ధరలను ప్రజలకు అనుగుణంగా సేవలందించడం జరిగిందని పేర్కొన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం 12 ఏళ్లు పరిపాలనలో ఉంటూ, లక్షల కోట్లు అప్పు చేస్తూ సామాన్య ప్రజలను నడ్డి విరిస్తున్నాడని , సామాన్య ప్రజలకు అందించాల్సిన సంపదంత కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నాడని ఘాటుగా వ్యాఖ్యానించారు. దేవుడి పేరుతో రాజకీయం చేయొద్దని, ప్రజలకు మేలు జరగనప్పుడు జై భారత్ మాత, జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేయడం చెప్పితే ప్రజల సంక్షేమం కోసం బిజెపి ప్రభుత్వం పని చేయట్లేదని ఎద్దేవా చేశారు. బిఆర్ఎస్ పార్టీ, బిజెపి పార్టీ లోపాయికారీ ఒప్పందల వల్ల ప్రజల పక్షాన నిలబడి కొట్లాడారని అన్నారు.

నిన్న జరిగిన బండి సంజయ్ పడుకో చేసిన ఉదంతానికి బిఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్నాలు నిరసనలు చేపట్టారు, ప్రజలకు అవసరమైన నిత్యవసర వస్తువులు, డీజిల్, పెట్రోల్ ధరల పెంపుపై ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. బిజెపి నాయకులు చెబితేనే జై శ్రీరామ్ నినాదం అనట్లేదు, కొన్ని దశాబ్ద కాలంగా రాముని దేశ ప్రజలందరూ కొలుస్తున్నారని, బిజెపి పార్టీ వారికే శ్రీరాముడు కాడని, దేశంలో ఉన్న ప్రతి పౌరునికి శ్రీరాములు దేవుడని అన్నారు. ఈ చేపట్టిన నిరసన కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ మాధవి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సాయి చరణ్ రెడ్డి, తిరుపతయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి బ్రహ్మచారి, కౌన్సిలర్లు ధనలక్ష్మి, మహేశ్వరి, విజయలక్ష్మి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు శరవంద, కోళ్ల వెంకటేష్, ఆదిత్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు.