27 May, 2026 | 11:52 AM

గాలివానతో గుడిసె పైకప్పు చిన్నాభిన్నం.. రోడ్డున పడిన పేదకుటుంబం

27-05-2026 10:45 AM

కల్లూరు,మే 27(విజయ క్రాంతి): మండల పరిధిలోని రఘునాద గూడెం ఎస్సీ కాలనీలో నివసిస్తున్న తాళ్లూరు కనకయ్య–రేవతి దంపతుల ఇంటికి మంగళవారం అకాల గాలివాన తీవ్ర నష్టం కలిగించింది. తాటాకు కప్పుతో నిర్మించుకున్న వారి చిన్న గుడిసెపై బలమైన గాలి, దుమ్ము దాడి చేయడంతో పైకప్పు పూర్తిగా ధ్వంసమై,తాటాకులు అన్ని చెదిరిపోయాయి.

ఉరుములు, మెరుపులతో కూడిన గాలివాన కారణంగా పైకప్పు ఒక్కసారిగా ఎగిరిపోవడంతో భయభ్రాంతులకు గురైన కుటుంబ సభ్యులు బిక్కుబిక్కుమంటూ బయటకు పరుగులు తీశారు.ఈ ఘటనతో వారు నివాసం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని గ్రామ సర్పంచ్ కుక్క సుధారాణి దృష్టికి చరవాణి ద్వారా తీసుకెళ్లగా,ఆమె స్పందిస్తూ సమస్యను ఎమ్మార్వోకు తెలియజేసి అవసరమైన సహాయం అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.