15 May, 2026 | 8:15 PM

Breaking News

పరీక్ష కేంద్రం వద్ద చల్లటి నీరు, అంబలి పంపిణీ చేసిన గ్రామ సర్పంచ్ బొడ్డు స్పందన గంగన్న   •   జవహర్ నవోదయ పాఠశాలకు భూమి స్వాధీనం.. రైతులతో చర్చించి సరిహద్దుల ఖరారు   •   ఫిర్యాదుదారుడితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి   •   మలిదశ ఉద్యమకారుల ముందస్తు అరెస్ట్   •   ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో ప్రత్యేక సమావేశం   •   ఉపాధి హామీ పథకం పేరును కేంద్ర ప్రభుత్వం మార్చడం సిగ్గుచేటు   •   దొంగలు... బాబోయ్... దొంగలు...   •   చెంచుల జీవనోపాధికి టీజీఐఎల్పీ కీలకం   •   మోడీది డబుల్ ఇంజన్ సర్కార్ కాదు.. రెండు నాలుకల సర్కార్   •   మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సోమయ్య   •  

వేంపల్లి టింబర్ డిపోలో కలప వేలం

23-12-2025 01:40 PM

24న వేలం నిర్వహణ

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): కాగజ్ నగర్ మండలంలోని వేంపల్లి టింబర్ డిపోలో ఈ నెల 24వ తేదీ (బుధవారం) ఉదయం 11.00 గంటలకు కలపను వేలం ద్వారా విక్రయించనునట్లు  అటవీ శాఖ అధికారులు తెలిపారు. కలప అమ్మకాన్ని జిల్లా అటవీ అధికారి నీరజ్ కుమార్ టిబ్రేవాల్ పర్యవేక్షణలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అటవీ శాఖ నిబంధనలకు అనుగుణంగా ఈ వేలం పూర్తి పారదర్శకతతో నిర్వహించబడుతుందని తెలిపారు.అర్హత కలిగిన కలప వ్యాపారులు, వినియోగదారులు వేలంలో పాల్గొనవచ్చని తెలిపారు.అన్ని షరతులు, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు. కలప రకాలు, పరిమాణం, వేలం విధానం, రిజిస్ట్రేషన్ వివరాల కోసం ఆసక్తి గల వారు వేంపల్లి టింబర్ డిపో కార్యాలయాన్ని సంప్రదించాలని పేర్కొన్నారు.