calender_icon.png 10 February, 2026 | 1:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు-

10-02-2026 12:00:00 AM

మునిసిపల్ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ఖమ్మం టౌన్, ఫిబ్రవరి 9 (విజయ క్రాంతి): మున్సిపల్ ఎన్నికల పోలింగ్ పకడ్బందీగా జరిగేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. మునిసిపల్ ఎన్నికలపై సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ రాణి కుముదిని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ, సాధారణ ఎన్నికల పరిశీలకులు పవన్ కుమార్ లతో కలిసి పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ ఖమ్మం జిల్లా పరిధిలో 5 మున్సిపాలిటీల్లో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు. ఎన్నికల పరిశీలకుల సమక్షంలో మూడవ ర్యాండమైజేషన్ పూర్తిచేసి పోలింగ్ బృందాలను ఫైనల్ చేసామని, పోలింగ్ సిబ్బందికి అవసరమైన శిక్షణ అందించామని అన్నారు. ప్రతి మున్సిపాలిటీ పరిధిలో డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలను పకడ్బందీగా ఏర్పాటు చేశామని, అక్కడ పోలింగ్ సిబ్బందికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ తెలిపారు.

కౌంటింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియ కూడా పూర్తయినట్లు, కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ అందించామని, కౌంటింగ్ హాల్స్ నందు అవసరమైన ఏర్పాట్లు కల్పించామని కలెక్టర్ తెలిపారు. 100 శాతం పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామని, పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ విజయవంతంగా పూర్తి చేసామని, పోలింగ్ ముగిసిన వెంటనే సిబ్బందికి అవసరమైన టిఏ, డిఏ ల చెల్లింపులు జరిపేలా వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతి మున్సిపాలిటీకి ఒక ఇంచార్జి అధికారి ఎన్నికల నిర్వహణ కోసం కేటాయించా మన్నారు.

పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుంటూ సమస్యా త్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు భద్రత ఏర్పాటు చేశామని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతం గా ఎన్నికలు జరిగేలా పటిష్టంగా చర్యలు తీసుకున్నామని అన్నారు.  ఈ సమావేశంలో జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ముజాహిద్, అధికారులు పాల్గొన్నారు.