12 August, 2026 | 2:32 PM

ఆగర్‌గూడ శివారులో పులి సంచారం

12-08-2026 01:20 PM

పెంచికల్‌పేట్ (విజయక్రాంతి): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్‌పేట్ మండలం ఆగర్‌గూడ గ్రామ శివారులో పులి సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో గ్రామంలో అధికారులు డప్పుచాటింపు నిర్వహించారు. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, కూలీలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒంటరిగా పొలాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పులి కనిపించినా దాని సమీపానికి వెళ్లకుండా వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు. గ్రామస్థులు భయాందోళనకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.