12 August, 2026 | 3:26 PM

శిథిలావస్థకు చేరిన ఎన్జీవో భవనం

12-08-2026 02:22 PM

బోథ్,ఆగస్టు12(విజయక్రాంతి): మండల కేంద్రంలో గత 20 సంవత్సరాల క్రితం నిర్మించిన ఎన్జీవో భవనం శిథిలావస్థకు చేరుకుంది. దీంతో భవనాన్ని నూతనంగా నిర్మించాల్సిన అవసరం ఏర్పడింది. భవనం కు సంబంధించిన తలుపులు కిటికీలు ధ్వంసం చేశారు. భవనాన్ని వినియోగించుకోకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. అయితే ఇటీవల ఎన్జీవో ఎన్నికలు జరగడంతో అధ్యక్షులుగా శ్రావణ్ కుమార్ ను ఎన్నుకోవడం జరిగింది. శిథిలావస్థల చైర్మన్ ఆయనను వివరణ కోరగా ఈ విషయాన్ని జిల్లా అధ్యక్షుల దృష్టికి తీసుకు వెళ్తామని సాధ్యమైనంత త్వరలో భవనాన్ని నిర్మించుకునే ఏర్పాటు చేస్తామన్నారు.