శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో తొలిఏకాదశి పూజలు
25-07-2026 08:39 PM
సంస్థాన్ నారాయణపూర్,(విజయక్రాంతి): తొలి ఏకాదశి సందర్భంగా రాచకొండలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయానికి భక్తులు స్వామి వారికి అభిషేకాలు అర్చనలు నిర్వహించారు. అనంతరం కొయ్యలగూడెం శ్రీభమరాంబిక భక్త భజన బృందంచే భజన కార్యక్రమం నిర్వహించారు . అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు.






