25 July, 2026 | 9:25 PM

ఉన్న పోస్టులను తగ్గించడం సరైనది కాదు

25-07-2026 08:36 PM

అంగన్‌వాడీ హెల్పర్ ఖాళీలన్నింటినీ తక్షణమే భర్తీ చేయాలి

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): అంగన్‌వాడీ కేంద్రాలలో కాళిగా ఉన్న హెల్పర్ల పోస్టులను కుదించడం, నియమించకపోవడం ఏమాత్రం సరైనది కాదని,  ప్రభుత్వం ఇటీవల 10 మంది కంటే తక్కువ పిల్లలు ఉన్నారనే నెపంతో హెల్పర్ పోస్టుల కొన్ని అంగన్వాడి కేంద్రాలకు మంజూరును నిలిపివేస్తూ జారీ చేసిన సర్క్యులర్‌ను తక్షణమే రద్దు చేయాలని అంగన్వాడి జిల్లా కార్యదర్శి జి పద్మ ప్రభుత్వాన్ని డిమాండ్  చేశారు. తెలంగాణ అంగన్వాడి టీచర్స్ & హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో డిబ్ల్యూఓ ఆఫీస్ లో శ్రీకాంత్ కి శనివారం వినతి పత్రం అందజేశారు. 

ఐసీడీ ఎస్డీడబ్ల్యూకి ఫోన్లోసమాచారం అందజేయటం జరిగింది. ఈవిషమై డిబ్ల్యూఒ మాట్లాడుతూ పదిమంది కంటే పిల్లలు తక్కువ ఉంటే నోటిఫికేషన్ ఇవ్వద్దు అని కమిషనర్ ఆఫీస్ నుండి సర్కులర్ వచ్చిందని ఆ లెక్క ప్రకారమే మేము చేశామన్నారు. పదిమంది పిల్లలు ఉన్న అన్ని కేంద్రాలకు హెల్పర్ పోస్టులభర్తీకి నోటీఫికేషన్  ఇచ్చామని చెప్పారు. పిల్లలు ఉన్న అన్ని కేంద్రాలకు కూడా సెకండ్ ప్లేస్ లో మున్సిపాలిటీ పరిధిలో సెకండ్ ప్లేస్ సులో ఇస్తామన్నారు . 10మంది పిల్లలకంటే తక్కువ ఉన్న వాటికి మాత్రం నోటిఫికేషన్ ఇవ్వలేమన్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ అంగనవాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి జి పద్మ మాట్లాడుతూ ఈ ఏడాది పిల్లలు తక్కువగా ఉన్నారని ఇప్పుడు హెల్పర్ పోస్ట్లు భర్తీ చేయకపోతే భవిష్యత్తులో హెల్పర్ పోస్ట్ లకు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఉందని, ఇప్పటికే 10 సంవత్సరాలకు పైగా హెల్పర్ పోస్ట్లు భర్తీ కాక టీచర్లు చాలా ఇబ్బంది పడుతున్నారన్నారు.  అలాగే పోస్టుల భర్తీలో రిజర్వేషన్ ప్రక్రియలో అనుసరించిన రాష్ట్ర విధానం గందరగోళంగా ఉందని రోస్టర్ విధానాన్ని సరిచేయాలని డిమాండ్ చేశారు.పది మంది ఉంటేనే హెల్పర్ పోస్ట్ ఇవ్వాలని సర్కులర్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దేవి, రాధాకుమారి, నాగమణి, లక్ష్మీ, రాధ తదితరులు పాల్గొన్నారు