తాగునీటి కష్టాలు తీర్చేందుకు బోర్ వేయించిన ఎమ్మెల్యే...
ఉట్నూర్,(విజయక్రాంతి): ఇంద్రవెల్లి మండలంలోని డిన్నర్ గ్రామపంచాయతీ పరిధిలోని తోయగూడ గ్రామ గిరిజనులు వర్షాకాలంలో సైతం తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. ఈ గ్రామానికి మిషన్ భగీరథ నీరు సరఫరా కాకపోవడంతో వ్యవసాయ బావి నుండి తాగునీరు తీసుకు వస్తున్న విషయాన్ని సర్పంచ్ మెస్రం భీమ్ రావు తో పాటు గ్రామస్తులు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే తాగునీటి సమస్య తీర్చేందుకు బోరు వేసేందుకు నిర్ణయించారు. ఎమ్మెల్యే నిర్ణయం మేరకు శనివారం బోరు వాహనం తోయగూడ గ్రామానికి చేరుకొని కొత్త బోర్ వేశారు. దీంతో గ్రామస్తుల తాగునీటి సమస్య తీరిందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామస్తులు సర్పంచ్ విన్నపం మేరకు బోరు వేయించిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.






