25 July, 2026 | 8:56 PM

ఎల్ నినో పట్ల రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించండి: ఏఎంసీ దోమ ఆనంద్

25-07-2026 08:00 PM

సత్తుపల్లి,(విజయక్రాంతి): ఎల్ నినో ప్రభావం పట్ల రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గుచూపి, ఆరుతడి పంటలను మాత్రమే పండించుకోవాలని,వ్యవసాయ మార్కెట్ చైర్మన్ దోమ ఆనంద్ బాబు శనివారం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు రాకపోవటం పట్ల, భూగర్భ జలాలు అడుగంటి పోవటంతో, రైతులు ఆరుతడి పంటలు వేయాలని, వర్షాధార పంటలపై ఆధారపడితే రైతులు నష్టపోయే ప్రమాదం ఉండదని, తక్కువ నీటిని ఉపయోగించే పంటలను వేయాలని, దీని ద్వారా పంట త్వరగా చేతికి రావడం, రైతు లబ్ధి పొందటం జరుగుతుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు నష్టపోకూడదని, వ్యవసాయ అధికారుల సలహాలు సూచనల తోటి పంటలు వేసి, అభివృద్ధి చెందాలని కోరారు. నీటిని కూడా వృధా కాకుండా పొదుపుగా వాడుకోవాలని, కరువు పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి, మంచి పంటలను పండించుకొని అభివృద్ధి చెందాలని కోరారు. వ్యవసాయ అధికారులు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారు కాబట్టి, వారి సూచనలు సలహాలతో ముందుకు సాగాలని తెలిపినారు.