25 July, 2026 | 8:52 PM

వాసవి పాఠశాలలో ఆషాడ మాసం గోరింటాకు సందడి

25-07-2026 07:43 PM

బోథ్,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని వాసవి పాఠశాలలో శనివారం ఆషాడ మాసం సందర్భంగా గోరింటాకు సందడి నెలకొంది. పాఠశాలలోని విద్యార్థులకు ఉపాధ్యాయులు గోరింటాకు పెట్టి దాని ప్రాముఖ్యతను వివరించారు. వర్షాకాలంలో వివిధ రకాల వ్యాధులు ప్రబలకుండా గోరింటాకు ఇంతగానో ఉపకరిస్తుందన్నారు. మహిళలు తప్పనిసరిగా ఆషాడ మాసంలో గోరింటాకును పెట్టుకోవడం జరుగుతుందన్నారు. ముందస్తు వ్యాధులు ప్రబలకుండా ఎంతగానో ఉపకరిస్తుందని దాని ప్రాముఖ్యతను తెలిపారు.