calender_icon.png 15 February, 2026 | 1:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరుస విజయాలే వీరి సొంతం

15-02-2026 12:04:55 AM

ఆరుసార్లు గెలిచిన రవీందర్‌సింగ్

ఐదు పర్యాయాల విజేత సునీల్‌రావు

కరీంనగర్, ఫిబ్రవరి 14 (విజయక్రాంతి): కరీంనగర్‌లో కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా వరుస విజయాలు సాధి స్తూ ఇద్దరు మాజీ మేయర్లు చరిత్ర సృ ష్టించారు. అందులో ఒకరు బీఆర్‌ఎస్‌కు చెందిన సర్దార్ రవీందర్ సింగ్ కాగా, మరొకరు యాదగిరి సునీల్‌రావు. రవీందర్ సింగ్ 1995, 2000లో కౌన్సిలర్ గా, 2005, 2014, 2020, 2026లో కార్పొరేటర్‌గా ఆరుసార్లు గెలిచి అరుదైన రికార్డు సృష్టించారు.మాజీ మేయర్ యాదగిరి నునీల్ రావు 2002లో కౌన్సిలర్, 2005, 2014, 2020, 2026లో కార్పొరేటర్‌గా ఐదు సార్లు విజయం సాధించి రికార్డు సృష్టించారు.

సునీల్ రా వు 2020, 2026లో అత్యధిక మెజార్టీతో గెలుపొంది మరో రికార్డును సా ధించారు. వీరితోపాటు రిజర్వేషన్లు అనుకూలించక ఒకసారి భర్త, ఒకసారి భార్య ఒకే కుటుంబానికి చెందినవారు ఐదుసార్లు విజయం సాధించారు. అందులో గుగ్గిళ్లపు మంజుల-రమేష్, చాడగొండ కవిత-బుచ్చిరెడ్డిలు ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఓటమి పాలైన సీనియర్లలో మాజీ మేయర్ డి శంకర్, మహ్మద్ అబ్బాస్ సమి, నేతికుంట యాదయ్యలు ఉన్నారు.