రాజీ మార్గమే.. రాజమార్గం
అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్ శివరాంప్రసాద్
హుజూర్ నగర్, జూన్ 12: రాజీ మార్గమే రాజమార్గమని అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్ శివరాం ప్రసాద్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని న్యాయస్థాన సముదాయంలో న్యాయవాదులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు... సూర్యాపేట జిల్లాలోనే అత్యధికంగా కేసులు రాజీ అయ్యే విధంగా కృషి చేయాలన్నారు. ఈనెల 20న జరిగే మెగా లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
సీనియర్ సివిల్ జడ్జి శ్యాంసుందర్ మాట్లాడుతూ... న్యాయవాదులందరూ అవకాశాన్ని వినియోగించుకోని అత్యధికంగా కేసులు రాజీచేసే విధంగా కృషి చేయాలని కోరారు. అదనపు జూనియర్ సివిల్ జడ్జి అయేషా షరీన్ మాట్లాడుతూ... మహిళలకు సంబంధించిన కేసులను కౌన్సిలింగ్ ద్వారా పరిష్కారం అయ్యే విధంగా న్యాయవాదులు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు జక్కుల వీరయ్య, ఏజిపిలు నట్టే సత్య నారాయణ, బానోత్ సురేష్, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.






