13 June, 2026 | 2:59 AM

ప్రభుత్వ పాఠశాలలో.. కూతుర్ని చేర్పించిన సర్పంచ్

13-06-2026 01:50 AM

కేసముద్రం, జూన్ 12 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రజాప్రతినిధులు ఈసారి ముందుకు వస్తున్నారు. కొత్తగా ఇటీవల ఎన్నికైన ప్రజాప్రతినిధులు గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తమ వంతు ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే పలు గ్రామాల్లో ప్రభుత్వ బడిలో పిల్లలను చేర్పిస్తే ఇంటి పన్ను మినహాయింపు, ఇతర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో ప్రాధాన్యత కల్పిస్తామంటూ ప్రచారం నిర్వహిస్తుండగా,

మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్న ముప్పారం గ్రామ సర్పంచ్ రాయలి భవాని శేఖర్ దంపతుల కుమార్తె మహతిని ప్రైవేటు పాఠశాల మాన్పించి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడానికి శుక్రవారం అంగీకార పత్రం ఉపాధ్యాయులకు అందించారు. ఇప్పటివరకు కేసముద్రంలో ప్రైవేట్ పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్న మహతిని తమ గ్రామంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో 8వ తరగతిలో చేర్పించారు. అలాగే గ్రామంలోని తమ మిత్రబృందం పిల్లలను కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తామని ప్రకటించారు.