‘కళ్యాణలక్ష్మి’ని రద్దు చేసే ప్రసక్తే లేదు
20-08-2026 12:17 AM
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు సాయిపేట శ్రీనివాస్
మేడ్చల్ అర్బన్ ఆగస్టు 19 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి,షాది ముబారక్ పథకాలను రద్దు చేసే ప్రసక్తే లేదని గుండ్లపోచంపల్లి మున్సిపల్ 299 వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ మాజి అధ్యక్షులు సాయిపేట శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్యాణలక్ష్మి, షాది ముబారక్ పథకాలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రద్దు చేస్తోందంటూ బిఆర్‌ఎస్ పార్టి నాయకులు చేస్తున్న ఆరోపణలు రాజకీయ దురుద్దేశ్యంతో కూడుకున్నదని ఆయన స్పష్టం చేశారు.రాష్ట్రంలోని పేద కుటుంబాలకు, నిరుపేద ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరో సా కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పథకాలను కొనసాగిస్తుందని సాయిపేట శ్రీనివాస్ వెల్లడించారు.






