23 June, 2026 | 11:01 AM

Breaking News

ప్రైవేట్ స్కూల్ నుంచి సర్కార్ బడికి సర్పంచ్ కూతురు   •   ముదిరాజ్ సంఘ మాజీ అధ్యక్షుడు వంతడుపుల అలియాస్ గొడుగు నర్సయ్య మృతి   •   ఆధారాలు ఉంటే చూపించండి.. మేము లెక్కలు చూపించడానికి సిద్ధం   •   విద్యుత్ శాఖ నిర్లక్ష్యానికి నిలువుటద్దం   •   తెలుగే కదా పండితుడు ఎందుకు అనుకుంటున్నారా?   •   కామారెడ్డిలో బిఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్   •   ప్రభుత్వ ఇసుక రీచ్‌పై దాడి.. సైట్ ఇంచార్జీపై దౌర్జన్యం   •   కోరం కనకయ్య వ్యాఖ్యలు అవగాహన రాహిత్యంతో కూడినవి: హరిప్రియ నాయక్   •   వ్యభిచారానికి అడ్డు చెప్పిన గ్రామస్తులపై కత్తితో దాడి   •   గాలివాన బీభత్సం: ఎర్రగడ్డలో కుటుంబం వీధి పాలు   •  

డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి యువత ముందుండాలి

23-06-2026 12:00 AM

ఎస్‌ఐ శ్రీనివాస్ గౌడ్

పాపన్నపేట, జూన్ 22: మాదక ద్రవ్యాలు, మత్తు క్షణిక ఆనందాన్ని ఇచ్చినా, జీవితాలను చిత్తు చేస్తుందని, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన, బాధ్యతాయుతమైన జీవితాన్ని గడపాలని పాపన్నపేట ఎస్‌ఐ శ్రీనివాస్ గౌడ్ పిలుపు నిచ్చారు. సోమవారం పాపన్నపేట జూనియర్ కళాశాలలో స్థానిక తహసీల్దార్ సతీష్ తో కలిసి మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల బారిన పడితే విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారడంతో పాటు కుటుంబాలు, సమాజం కూడా తీవ్రంగా నష్టపోతాయఅన్నారు. సమాజంలో పెరుగుతున్న మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు యువతే చైతన్య వంతులుగా మారి ఇతరులను కూడా అప్రమత్తం చేయాలని సూచించారు.

మత్తు పదార్థాలకు బానిస కావడం వల్ల ఆరోగ్య సమస్యలతో పాటు నేరప్రవృత్తులు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.‘మత్తు వద్దు నాన్న... జీవితం చిత్తవుతుంది కన్న‘ అనే నినాదంతో విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ, వాటి నిర్మూలనకు కృషి చేస్తామని విద్యార్థులు, అధ్యాపకులతో కలిసి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ నర్సింలు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.