గాయపడ్డ సింహం సమ్మర్ బిగ్ బ్లాక్‌బస్టర్ కావాలి
ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో దుల్కర్ సల్మాన్
తరుణ్ భాస్కర్ న్యూ-ఏజ్ ఎంటర్‌టైనర్ ‘గాయపడ సింహం’ తో అలరించబోతున్నారు. ఈ చిత్రం కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం లో మే 1న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. పవన్ సాదినేని సమర్పణలో ఈ చిత్రాన్ని కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్‌కృష్ణ లింగమనేని, ఉమేశ్ బన్సల్ నిర్మించారు. వెర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్ ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను శనివారం హైదరాబాద్‌లో లాంచ్ చేశారు.
ఈ ఈవెంట్‌లో దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. “గాయపడ్డ సింహం’ టైటిల్ విన్నప్పటి నుంచే నాకు చాలా క్యూరియాసిటీ కలిగింది. ‘ఆకాశంలో ఒక తార’ సినిమా చేస్తున్నప్పుడు పవన్ ఈ సినిమా గురిం చి ప్రతిదీ చెప్తుండేవారు. ఇది తప్పకుండా బిగ్ సమ్మర్ బ్లాక్‌బస్టర్ అవుతుందని నమ్మకం ఉంది” అన్నారు. నిర్మాత దిల్ రాజు మా ట్లాడుతూ.. “ఈ సినిమా ఐడియా చెప్పినప్పుడు చాలా నచ్చింది. కాన్సెప్ట్ బాగా అనిపించి వెంటనే కొనేశాం.
చాలా మంచి కాన్సెప్ట్. సెకండ్ హాఫ్‌లో ఐదు ఎపిసోడ్స్ థియేటర్లో బాగా వినోదం పంచుతాయి. అవి వర్క్ ఐతే ఇది మరో ‘జాతిరత్నాలు’ అవుతుంది” అన్నారు. చిత్ర దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. “నేను దుల్కర్‌కి పెద్ద ఫ్యాన్. ఆయన మా ట్రైలర్ లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. దిల్ రాజు నిర్మాతల్లో పవర్ స్టార్. ఆయన సపోర్ట్ మాకు చాలా బలం” అన్నారు. చిత్ర నిర్మాత భాను మాట్లాడుతూ.. “పాన్ ఇండియా స్టార్ దుల్కర్ సల్మాన్‌కు థాంక్యూ సో మచ్.
నేను ఆయనకి పెద్ద ఫ్యాన్. ఆయన కోసం కథలు కూడా రాసుకున్నా” అని చెప్పారు. కథానాయిక ఫరియా అబ్దుల్లా మాట్లా డుతూ.. “మేమంతా చాలా హార్డ్ వర్క్ చేసి ఈ సినిమా తీశాం. ఫస్ట్ 15 నిమిషాలు ఎవ్వరూ మిస్ అవ్వకూడదు” అని తెలిపారు. మరో హీరోయిన్ మానస మాట్లాడుతూ.. “గాయపడ్డ సింహం’ ఒక మంచి ఫన్ రైడ్” అన్నారు. జేడీ చక్రవర్తి, పవన్ సాదినేని తదితర చిత్రబృందం కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడారు.






