30 May, 2026 | 5:13 AM

పేదల సంక్షేమమే ప్రజాపాలన లక్ష్యం

30-05-2026 12:53 AM

ఎమ్మెల్యే బీఎల్‌ఆర్ 

మిర్యాలగూడ, మే 29: పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న ప్రజాపాలన లక్ష్యం అని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మా రెడ్డి అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ వ్యాప్తంగా 150 మంది లబ్ధిదారులు మంజూరైన రూ. 60లక్షల సీఎంఆర్ ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసి మాట్లాడారు.

కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఖరీదైన వైద్యం చేయించుకోలేని నిరుపేద కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్ వరంలాంటిదని అన్నారు. అనంతరం మాడ్గులపల్లి మండలానికి చెందిన కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తలకొప్పుల సైదులు, నాయకులు గుడిపాటి నవీన్, ఆవుల దేవేందర్ రెడ్డి, జగ్గారెడ్డి, రవీందర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.