30 May, 2026 | 4:20 AM

జమలాపురం దేవస్థానంలో మహా కుంభాభిషేకం

30-05-2026 12:54 AM

ఎర్రుపాలెం మే 29 (విజయక్రాంతి):  చిన్న తిరుపతిగా పేరుగాంచిన జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం నుండి శుక్రవారం వరకు జీర్ణోదరణ, ధ్వజ ప్రతిష్ట సహిత మహా కుంభాభిషేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో కె జగన్మోహన్రావు తెలియజేశారు. శ్రీ పరాభవ నామ సంవత్సరం జేష్ట పౌర్ణమి నుండి శ్రీ  శృంగేరి శారద పీఠం జగద్గురువులు శ్రీశ్రీశ్రీ భారతి తీర్థ మహాస్వామి ఆశీస్సులతో దేవస్థానంలో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఆలయంలో తేదీ 3 .7 .26 వరకు ప్రత్యేక అభిషేకాలు , పూజలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులకు ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. దేవాలయ వ్యవస్థాపక ధర్మకర్తల  చైర్మన్ ఉప్పల విజయ్ దేవర శర్మ, ఆలయ ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు, నిర్వహిస్తున్నట్లు వివరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీవారిని దర్శించి శ్రీవారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ ఈ  వో పేర్కొన్నారు.