27 August, 2026 | 3:43 AM

పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం

27-08-2026 02:33 AM

గజ్వేల్, ఆగస్టు 26: రాష్ట్ర అభివృద్ధి, పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు తూముకుంట అంక్షారెడ్డి, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు అశోక్ రెడ్డి అన్నారు.

అర్హులైన ప్రతి పేదకు సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. బుధవారం అహ్మదీపూర్లో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం నిర్వహించడంతో పాటు గజ్వేల్లో కౌన్సిలర్లు శ్రీనివాస్ గుప్త, గుంటుకు లక్ష్మీ శ్రీనివాస్లతో కలిసి స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందన్నారు.

గజ్వేల్ నియోజకవర్గంలోని 55 గ్రామాలకు రూ.5.50 కోట్లతో మహిళా భవనాలు మంజూరయ్యాయని, వాటి నిర్మాణాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణానికి రూ.5.41 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. నియోజకవర్గానికి 6 వేల ఇందిరమ్మ ఇళ్లు కేటాయించి అర్హులైన పేదలకు అందిస్తున్నట్లు చెప్పారు.  సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సుఖేందర్రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కొండల్రెడ్డి, నాయకులు అంజాగౌడ్, ప్రభాకర్, నర్సింహారెడ్డి, శివారెడ్డి, గాడిపల్లి శ్రీనివాస్, అజహర్ తదితరులు పాల్గొన్నారు.