1 July, 2026 | 6:38 PM

Breaking News

రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •   గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ   •   సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో జాతీయ డాక్టర్ల దినోత్సవవేడుకలు-2026   •   ప్రభుత్వ పాఠశాలలకు డ్యుయల్ డెస్క్ బెంచీల పంపిణీ   •   సింగరేణి హెడ్ ఆఫీస్ నందు కేంద్ర కార్మిక సంఘాల నిర్వహించిన మహా ధర్నా విజయవంతం   •   జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా పేదలకు ఉచిత వైద్య శిబిరం   •   గీతం 17వ గ్రాడ్యుయేషన్ డే ఆగస్టు 1న   •  

రైతుల లబ్ధే లక్ష్యంగా ఉండాలి

16-04-2026 12:00 AM

హైదరాబాద్, ఏప్రిల్ 15 (విజయక్రాంతి): రైతులకు లాభదాయకమైన, పారద్శక మార్కెటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని రైతు కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వర్క్‌షాప్‌లో నిర్ణయించారు. అందుకు ప్రభుత్వానికి ఒక సమగ్రమరైన నివేదికను అందజేయాలని అభిప్రాయపడ్డారు. వ్యవసాయం, మార్కెటింగ్ సమస్యలపై రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం రైతు కమిషన్ కార్యాయలంలో రాష్ట్ర స్థాయి వర్క్‌షాపు నిర్వహించారు.

ఈ వర్క్‌షాప్‌కు వివిధ రైతు సంఘాల నాయకులతో పాటు జిల్లాల నుంచి వ్యవసాయ, ఉద్యానవన, మార్కెటింగ్ శాఖ అధికారులు హాజరయ్యారు. మార్కెట్ యార్డుల్లో మౌలిక సదుపాయాలు, మార్కెట్ విస్తరణ, డిజిటల్ సాధనాల ప్రోత్సాహంతో పాటు మధ్యవర్తుల ఆధారాన్ని తగ్గించాలనే అంశాలపై విస్తృతంగా చర్చించారు. రైతులు మార్కెటింగ్ వ్యవస్థలో ఎదుర్కొంటున్న అనేక సవాళ్లు, రైతుల ఆదాయం, స్థిరత్వం, జీవనోపాధిని మెరుపర్చడ వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది.