6 April, 2026 | 4:29 PM

Breaking News

ఉపాధి హామీ పనిలో విషాదం – మహిళ మృతి   •   గోపాలరావుపల్లిలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం ఘనంగా నిర్వహణ   •   మాజీ ఎంపీటీసీ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం   •   సెస్ విలీనంతో పారదర్శక పాలన వినియోగదారులకు నాణ్యమైన సేవలు   •   ముఖ్యమంత్రిని సన్మానించిన ఖానాపూర్ కాంగ్రెస్ కౌన్సిలర్లు   •   ఉమామహేశ్వరంలో ప్రభుత్వ విప్ ప్రత్యేక పూజలు   •   ఢిల్లీ హైకోర్టుకు కేజ్రీవాల్.. లిక్కర్ కేసు విచారణ వాయిదా   •   హిందూ సమ్మేళనానికి రూ 5100 విరాళం   •   ప్రజావాణి ధరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి   •   బిజెపి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించిన మిట్టపల్లి ప్రవీణ్ కుమార్   •  

ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్

08-01-2026 12:41 AM
  1. పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ ఖరారు
  2. చరిత్రలో మొట్ట మొదటిసారి ఆదివారం పద్దు!

న్యూఢిల్లీ, జనవరి 7: కేంద్ర బడ్జెట్ 2026 ముహూర్తం ఏ రోజు ఉంటుందనేది ఉత్కంఠకు తెరపడింది. యేటా ఫిబ్రవరి 1వ తేదీనే కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ బడ్జెట్ ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ ఏడాది కూడా అదే తేదీననే కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతుందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ ఖరారు చేసిం ది.

బుధవారం భేటీ అయిన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ ఫిబ్రవరి1 ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు నిర్ణయిం చింది.    పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయంతో చరిత్రలో మొదటిసారి ఆదివారం కేంద్రప్రభుత్వం పద్దు ప్రవేశపెట్టి, సరికొత్త రికార్డుకు నాంది పలుకనుంది. అన్ని సజావుగా సాగితే ఈ నెల ౩1న  బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. తొలిరోజు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.