22 July, 2026 | 1:46 AM

ఆధునిక వసతులతో అభివృద్ధి దిశగా 5వ బెటాలియన్

22-07-2026 12:06 AM

నూతన నిర్మాణాలను ప్రారంభించిన అదనపు డీజీపీ

గోవిందరావుపేట, జూలై 21 (విజయ క్రాంతి): ములుగు జిల్లా చల్వాయి గ్రామంలో ఉన్న 5వ బెటాలియన్ తెలంగాణ స్పెషల్ పోలీస్ ఆవరణలో నూతనంగా నిర్మించిన గార్డ్ రూమ్, గ్యాలరీ షెడ్లు, రిక్రియేషన్ హాల్లను తెలంగాణ స్పెషల్ పోలీస్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సంజయ్ కుమార్ జైన్ మంగళవారం ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ములుగు ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, అదనపు పోలీసు సూపరింటెండెంట్  మానన్ బట్, 5వ బెటాలియన్ కమాండెంట్ సుబ్రహ్మణ్యం, అదనపు కమాండెంట్ సీతారాం, అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏడీజీపీ మాట్లాడుతూ, 5వ బెటాలియన్లో మౌలిక వసతుల అభివృద్ధి ఎంతో అభినందనీయమని, పోలీసు సిబ్బందికి మెరుగైన పని వాతావరణం, విశ్రాంతి మరియు సంక్షేమం కోసం చేపడుతున్న నిర్మాణాలు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.

ఇలాంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా సిబ్బంది మరింత ఉత్సాహంతో విధులు నిర్వహించే అవకాశం కలుగుతుందని ఆయన తెలిపారు. అనంతరం నూతన నిర్మాణాలను పరిశీలించిన ఏడీజీపీ, వాటి నిర్మాణ నాణ్యతను అభినందిస్తూ బెటాలియన్ అభివృద్ధికి కృషి చేస్తున్న అధికారులను ప్రశంసించారు.

అనంతరం సిబ్బందికి దర్బారు ఏర్పాటు చేసి సిబ్బంది అవసరత తెలుసుకొని వాటిని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని అన్నారు.   బెటాలియన్ సహాయ కమాండెంట్ కృష్ణ ప్రసాద్, ఆర్ ఐ లు భాస్కర్, వెంకటేశ్వర్లు, సాయిబాబు మరియు బెటాలియన్  సిబ్బంది పాల్గొన్నారు.