19-02-2026 02:59:33 AM
సుహాస్, శివానీ నాగారం జంటగా నటిస్తున్న తాజాచిత్రం ‘హే బలవంత్’. ఇందులో సీనియర్ నటుడు నరేశ్, యాంకర్ స్రవంతి ముఖ్యపాత్రల్ని పోషించారు. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశూల్ విజనరీ స్టూడియోస్ పతాకంపై బీ నరేంద్రరెడ్డి నిర్మిస్తున్నారు. బన్నీవాస్, వంశీ నందిపాటి ద్వయం ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఫిబ్రవరి 20న రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. “సుహాస్ కథను నమ్మి సినిమాలు చేసే హీరో. ఈ సినిమాతో సుహాస్ ప్రేక్షకుల మనసులు మరోసారి గెలుచుకుంటాడు” అన్నారు. సుహాస్ మాట్లాడుతూ.. “హే బల్‌వంత్’తో నాకు పెద్ద హిట్ వస్తుందని నమ్ముతున్నా” అన్నారు. శివానీ నాగారం మాట్లాడుతూ “ఈ సినిమా టైటిల్ మారగానే అందరం టెన్షన్ పడ్డాం. కానీ ఆ భగవాన్ బల్‌వంత్‌గా మార్చాడు. సుహాస్‌తో నాకు స్పెషల్ సినిమా.
అంబాజీపేట సినిమాలో మనం చాలా సినిమాలు చేయాలి. నీ ప్రతి బ్లాక్‌బస్టర్‌లో నేనుండాలి అన్నాను. తప్పకుండా ఈ సినిమా తప్పకుండా బ్లాక్‌బస్టర్ అవుతుంది” అన్నారు. దర్శకుడు గోపీ అచ్చర మాట్లాడుతూ.. “మారింది టైటిలే. కంటెంట్, ఎంటర్‌టైన్‌మెంట్ కాదు. తప్పకుండా బ్లాక్‌బస్టర్ అయ్యే సినిమా ఇది” అన్నారు. వంశీ నందిపాటి మాట్లాడుతూ.. “డేట్‌లు మారినా, టైటిల్ మారినా, ఫిబ్రవరి 20న మా సినిమా క్రియేట్ చేసే ఇంపాక్ట్ మారదు.
ఇందులో ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ ఉంటుంది. సినిమా చూసి వెళ్లేటప్పుడు అందరి హృదయాలు బరువెక్కుతాయి. ప్రేక్షకులకు పైసా వసూల్ సినిమా” అని చెప్పారు. నిర్మాత బీ నరేంద్ర రెడ్డి మాట్లాడుతూ.. “మా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ఇది. ఇరవై కథలు విన్న తర్వాత గోపి చెప్పిన కథ నచ్చి, త్వరితగతిన షూటింగ్ పూర్తిచేశాం” అన్నారు.
ఈ కార్యక్రమంలో లిరిక్ రైటర్ కేకే, ఎడిటర్ విప్లవ్, డీవోపీ, మహిరెడ్డి, రైటర్ మిథున్, సంగీత దర్శకుడు వివేక్ సాగర్, దర్శకుడు సందీప్ రాజ్, నిర్మాత ధీరజ్ మొగలినేని, నటీనటులు హర్షవర్థన్, దివ్య, విద్య, సుదర్శన్, స్రవంతి చొక్కారపు, లావణ్యరెడ్డి, నిర్మాత, ఛాయ్‌బిస్కెట్ ఫౌండర్ అనురాగ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.